ఎయిర్పోర్టుకు మెట్రో సేవలు

ఎయిర్పోర్ట్ వరకు హైదరాబాద్ మెట్రో విస్తరణ

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ ఎం ఆర్ ఎల్ ) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ వి ఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో రైల్ విస్తరణ లో భాగంగా మొదట మైండ్స్పేస్ జంక్షన్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు విస్తరణ ఉంటుందన్నారు.
ఈ విస్తరణలో 3 కిలోమీటర్లు భూగర్భ మార్గం ఉంటుందని తెలిపారు . కాగా ఈ ప్రాజెక్టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పిపిపి) లో నా లేక మొత్తం ప్రభుత్వం భరించనున్నాదా అనే విషయమై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు .

విమానాశ్రయ మార్గం లో పనులు ప్రారంభించటానికి అనుమతులు రాగానే పని ప్రారంభిస్తామన్నారు. ఈ మార్గములో మెట్రో స్టేషన్లు గచ్చిబౌలి , ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ , నార్సింగి , పోలీస్ అకాడమీ , రాజేంద్ర నగర్ , మొదలైనవి ఉండొచ్చు అన్నారు.