ఆర్టీసీసమ్మె పై అమిత్‌ షాను కలుస్తాం


సమ్మెను విరమించే ప్రసక్తే లేదు.. మరింత ఉద్ధృతం చేస్తాం

ashwathama-reddy
ashwathama-reddy

హైదరాబాద్‌: తమ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తామని టీఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమ్మెను విరమించే ప్రశ్నేలేదని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. ఈ రోజు ఆయన ఆర్టీసీ జేఏసీ, ప్రతిపక్ష నేతలతో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమ్మెపై త్వరలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలువనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో కలిసి ఈ నెల 4 లేదా 5న ఆయనతో కలువనున్నట్లు అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/