నేడు మేడారం జాతర ఆఖరి ఘట్టం

Medaram jatara
Medaram jatara

మేడారం: తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతరలో ఇవాళ చివరి ఘట్టం ఆవిష్కృతం కానుంది. మూడు రోజుల పాటూ పూజలందుకున్న వన దైవాలు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు… ఇవాళ తిరిగి తమ వనాలకు వెళ్లిపోబోతున్నారు. అమ్మవార్లను ఘనంగా సాగనంపేందుకు భక్తులు మేడారంలో ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమం ఎలా సాగుతుందంటే… ముందుగా… నలుగురు దేవతల పూజారులూ గద్దెల దగ్గర పూజలు చేసి ఆపై సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం దగ్గర్లోని చిలకలగుట్టపైకి తీసుకెళ్తారు. ఇదంతా గద్దెల దగ్గర ఉన్న భక్తులు కళ్లారా చూసేందుకు వీలుంటుంది. ఐతే… బయటి వారు మాత్రం దీన్ని చూసే వీలు లేదు. ఆలయం దాటిన తర్వాత బయటివారిని లోపలికి రానివ్వరు. అందువల్ల ఇంకా ఎవరైనా అమ్మవార్లను దర్శించుకోలేకపోతే… సాయంత్రం లోపే వెళ్లి దర్శించుకుంటే… అమ్మవార్లను అడవిలోకి పంపే ఘట్టాన్ని కళ్లారా చూసి తరించే అవకాశం లభిస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/