సియం కేసిఆర్‌కు మావోలు హెచ్చరికలు!

KCR
KCR, Telangana CM

హైదరాబాద్‌: తెలంగాణ సియం కేసిఆర్‌కు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. హరితహారం పేరుతో కేసిఆర్‌ ప్రభుత్వం ఆదివాసీల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుందని మావోలు ఆరోపించారు. దశాబ్దాలుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఆశ చూపి, రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌ పేరిట లేఖ విడుదల అయింది. కేసిఆర్‌ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలనీ, లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని లేఖలో జగన్‌ హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్‌ బలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/