టిఆర్‌ఎస్‌కు వ్యతిరేక ఫలితాలు ఖాయం

Mallu Ravi
Mallu Ravi

హైదరాబాద్‌: గురువారం జరిగిన లోక్‌సభ ఎనికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధిక మేజారిటితో విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యేమల్లు రవి అన్నారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతు.. సిఎం కెసిఆర్‌ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలోని అత్యధిక లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధిస్తారని మల్లు రవి చెప్పారు. కెసిఆర్‌ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని, ఆయన నియంతృత్వానికి అడ్డుకట్టవేస్తేనే అందుబాటులోకి వస్తారని ప్రజలంతా భావించారన్నారు. టిఆర్‌ఎస్‌ 16 స్థానాల్లో విజయం సాధిస్తోందంటూ కెసిఆర్‌, కెటిఆర్‌, కవితతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు అబద్ధాలు చెప్పారని ఆయన అన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/