మేక్‌ మై ట్రిప్‌ ను ప్రారంభించిన హైదరాబాద్‌ మెట్రో

Metro rail
Metro rail

హైదరాబాద్‌: భాగ్యనగరంలోని మెట్రో రైల్‌ టికెట్‌ పొందడం కోసం మేక్‌ మై ట్రిప్‌ ను ప్రారంభించినట్లు మెట్రో ఎండి ఎన్‌విఎస్‌ రెడ్డి తెలిపారు. హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌లో ఈ విధానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు సమయం వృథా కాకుండా ఉండేందుకే మేక్‌ మై ట్రిప్‌ అని అన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ విధానంలో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ప్రయాణించవచ్చని, ఆరుగురి వరకు ఒకేసారి బుక్‌ చేసుకోవచ్చని ఆయన వివరించారు. బుక్‌ చేసిన ట్రిప్‌ వివరాలను వాట్సాప్‌ ద్వారా సంబంధిత వ్యక్తులకు షేర్‌ చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. మొదటి విడతగా ఈ సౌకర్యాన్ని 20 మెట్రో స్టేషన్లలో కల్పిస్తున్నామని, జనవరి నుంచి మిగతా స్టేషన్లలో అందుబాటులోకి తేనున్నట్లు ఎన్‌విఎస్‌ రెడ్డి తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/