ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు ఈనెల 31 వరకు పొడిగింపు

TS LOGO
TS LOGO

హైదరాబాద్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅ‌వుట్‌ రెగ్యు‌ల‌రై‌జే‌షన్‌ స్కీమ్‌) దర‌ఖా‌స్తుల గడు‌వును ఈ నెల 31 వరకు ప్రభుత్వం పొడి‌గిం‌చింది. ఈమేర‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది. ఎల్‌‌ఆ‌ర్‌‌ఎ‌స్‌కు తొలుత గడువు ఈ నెల 15 వరకే ప్రభుత్వం విధించింది. భారీ వర్షాల కార‌ణంగా అనేక చోట్ల విద్యుత్‌ సర‌ఫరా నిలి‌చి‌పో‌యింది. ఇంట‌ర్నెట్‌ సేవ‌లకు అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో చాలా‌చోట్ల భూ యజ‌మా‌నులు ఎల్‌‌ఆ‌ర్‌‌ఎ‌స్‌కు దర‌ఖాస్తు చేసు‌కో‌లేక పోయారు. ఇంకా సమయం కావా‌లని వివిధ ప్రాంతా‌ల‌నుంచి విజ్ఞ‌ప్తులు వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరి‌స్థి‌తిని, వచ్చిన విజ్ఞ‌ప్తు‌లను పరి‌శీ‌లిం‌చిన సిఎం కెసిఆర్‌ గడు‌వును మరో 15 రోజు‌ల‌పాటు పొడి‌గిం‌చా‌లని నిర్ణ‌యిం‌చారు. ఈ మేరకు గడు‌వును పొడి‌గిం‌చి‌నట్టు సీఎస్‌ తెలి‌పారు. గురు‌వా‌రం‌నా‌టికి మొత్తం 18,99,876 దర‌ఖా‌స్తులు రాగా, ఒక్క‌రోజే 2.71 లక్ష‌లకు పైగా దర‌ఖా‌స్తులు వచ్చి‌నట్టు వివ‌రిం‌చారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/