మూడు రాజధానుల వల్ల నష్టమే తప్పా లాభం లేదు

v hanumantha rao
v hanumantha rao

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానుల విషయమై తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ..ఏపీకి మూడు రాజధానుల వల్ల నష్టమే తప్ప లాభం లేదన్నారు. ప్రజాధనం వృథా అవడమే తప్ప ఉపయోగం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉండగా మూడు రాజధానులు నిర్మించడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో అటు ఆంధ్రాలోను ఇద్దరు ముఖ్యమంత్రులు తమ ముద్ర కోసమే కొత్త రాజధానులు, కొత్త నిర్మాణాలు అంటున్నారని వి హెచ్‌ విమర్శించారు. కాగా ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి స్పేషల్‌ స్టేటస్‌ ఇవ్వలేమన్న కేంద్రం ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో కూడా అంగీకరించవద్దని కోరారు. రాజధానుల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా బిజెపి ప్రభుత్వం అడ్డుకోవాలని సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/