నిజామాబాద్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినం

ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్‌

corona virus
corona virus

నిజామాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళనలకు గురిచేస్తుంది. దీంతో అధికారులు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో అధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండడంతో జిల్లా కలెక్టర్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఇప్పటికే నిజామాబాద్‌ నగరపాలక సంస్థతో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ పురపాలక సంఘాలు, మాక్లూర్‌, మోస్రా, రెంజల్‌ మండలం కందకుర్తి ప్రాంతాల్లో క్లస్టర్‌లను ఏర్పాటుచేశారు. ప్రజలు నిత్యవసరాలకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. మెడికల్‌ షాపులు తప్ప మిగిలిన అన్ని షాపులు మూసేయాలని ఆదేశించారు. అనవసరంగా బయట తిరిగితే పోలీసులు కేసులు నమోదు చేస్తారని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/