ముగిసిన స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

MLC elections
MLC elections

హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగిన ఈ పోలింగ్‌లో ప్రాదేశిక సభ్యులు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2గంటల వరకు 96.67 శాతం పోలింగ్‌ నమోదైంది.వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక కోటా ఎమ్మెల్సీల స్థానాల ఉప ఎన్నిక కోసం టిఆర్‌ఎస్‌ తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. మొత్తం మూడు ఎమ్మెల్సీల పరిధిలో 2799 మంది ఓటర్లు ఉండగా.. 25 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూన్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/