రైతు బంధు ఎన్నికల బంధుగా మారింది

లిక్కర్‌ ధరలు పెంచుతున్నా…పంటలకు ధరలు ఎందుకు పెంచడం లేదు

revanth reddy
revanth reddy

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని అన్నారు. రైతు బంధు ఎన్నికల బంధుగా మారిందని విమర్శించారు. రుణమాఫీ ఎందుకు చేయలేదని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు వస్తారా అని సవాల్‌ విసిరారు. తెలంగాణలో లిక్కర్‌ ధరలు పెంచుతున్నా ముఖ్యమంత్రి కెసిఆర్‌..పంటలకు ధరలు ఎందుకు పెంచడం లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం నుంచి ఏటా 530 టీఎంసీలు ఎత్తిపోస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని..180 టీఎంసీలకు మించి ఎత్తిపోయలేదన్నారు. ఇంకా మై హోమ్‌ రామేశ్వరరావు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి భేటీ జరగడం వెనక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఉన్నారని..దానిపై స్పందించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/