లింగన్న మృతదేహానికి ముగిసిన రీపోస్టుమార్టం

Gandhi Hospital
Gandhi Hospital

హైదరాబాద్‌: న్యూ డెమోక్రసీ సభ్యుడు లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆయన మృతదేహానికి ముగ్గురు వైద్యుల బృందం రీపోస్టుమార్టం నిర్వహించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను చిత్రీకరించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రీపోస్టుమార్టానికి సంబంధించిన నివేదికను వైద్యబృందం ఈనెల 5న హైకోర్టుకు సమర్పించనుంది. శవపరీక్ష దృష్ట్యా గాంధీ ఆస్పత్రి పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే శవపరీక్ష వద్దకు అనుమతించారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/