5, 6 తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి జల్లులు!

cloudy
cloudy


హైదరాబాద్‌: వాతావరణంలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ధ్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్‌లో కూడా ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/