ఈ నెల 11న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

cm kcr
cm kcr

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 11న సాయంత్రం ప్రగతిభవన్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇరిగేషన్‌ శాఖకు సంబందించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దుమ్ముగూడెం వద్ద 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పాటు 320 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా ఆనకట్ట నిర్మించాలని సీఎం నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్న నేపథ్యంలో మొత్తం మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా అదనపు పనులు చేపట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కొత్త రెవెన్యూ చట్టంపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశముంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని సీఎం కెసిఆర్‌ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రెవెన్యూ చట్టంపై మంత్రివర్గం చర్చించే అవకాశముంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/