టూరిస్ట్‌ హబ్‌గా గండిపేట రిజర్వాయర్‌

land scaping park
land scaping park

హైదరాబాద్‌: చారిత్రక గండిపేట రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు హెచ్‌ఎండిఏ సుందరీకరణ పనులకు శ్రీకారం చేట్టింది. 1920లో నిర్మించిన ఉస్మాన్‌సాగర్‌ 2020 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ రిజర్వాయర్‌ను టూరిస్ట్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు గాను రూ. 100 కోట్లతో సుందరీకరణ పనులను సర్కారు హెచ్‌ఎండిఏకు అప్పగించింది.
తొలి విడతగా జలమండలి ద్వారక పార్క్‌కు ఆనుకుని ఉన్న 18 ఎకరాల విస్తీర్ణంలో రూ. 35.6 కోట్లతో ల్యాండ్‌ స్కేప్‌ పార్కు పనులకు టెండర్లను ఆహ్వానించింది. పార్కులో కిడ్స్‌ ప్లే ఏరియా, ఫుడ్‌ కోర్టులు, బోర్డ్‌ వాక్‌, టెర్రస్‌ గార్డెన్స్‌, పిక్నిక్‌ స్పేస్‌, ఔట్‌డోర్‌జిమ్‌, సైకిల్‌ ట్రాక్స్‌, ఆర్ట్‌ పవిలైన్స్‌, వివింగ్‌ డక్స్‌ అండ్‌ జెట్టిస్‌, ఎంట్రన్స్‌ పవిలైన్‌ విత్‌ వాచ్‌ అండ్‌ వార్డ్‌రూమ్‌, ఎంట్రన్స్‌ ప్లాజాలు ఏర్పాటు చేయనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/