టీఆర్టీ అభ్యర్థులతో లక్ష్మణ్‌ దీక్ష

lakshman ,jeevan reddy
lakshman ,jeevan reddy

హైదరాబాద్‌: 2017లో టీఆర్టీకి ఎంపికైనా 8,792 మంది అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని అభ్యర్థులు దర్నాచౌక్‌ వద్ద రిలే చేట్టారు. ఈ దీక్షకు బిజిపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యె ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు లేరు అన్న నెపంతో పాఠశాలలు మూసేస్తున్నారని ఆరోపించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ… నిరుద్యోగ యువతే తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపారన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 1.20లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సీఎం ప్రకటించారు. ఇప్పటి వరకూ దాదాపు2.20లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే కేవలం 20వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. నిరుద్యోగ యువత ఉద్యమ బాట పడుతున్నారు.. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని డిమాండ్‌ చేశారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/