నేడు కూకట్‌పల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం

Kukatpally , Flyover
Kukatpally , Flyover

హైదరాబాద్‌: మలేషియన్‌ టౌన్‌షిప్‌ రాజీవ్‌ గాంధీ విగ్రహం నుండి జేఎన్టీయూ వరకు ఈరోజు ఫ్లైఓవరును ప్రారంభించారు. అయితే ఈ మార్గంలో నిర్మాణం పూర్తి అయిన‌ప్ప‌టికీ ఇంకా ప్రారంభించ‌క‌పోవ‌డంతో, ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను సామాజిక మాద్య‌మాలైన ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌, వాట్స‌ప్‌, ఈమెయిల్స్ ద్వారా నెటిజన్లు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి అమ‌లులో ఉన్నందున నిర్మాణం పూర్తి అయిన ఈ ఫ్లైఓవ‌ర్‌ను అధికారికంగా ప్రారంభించ‌డానికి అధికారులు నిరాక‌రించారు. అధికారికంగా కాక‌పోయిన ఈ ఫ్లైఓవ‌ర్‌ను వెంట‌నే రాక‌పోక‌ల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని వంద‌లాది మంది సామాజిక మాద్య‌మాల వేదిక ద్వారా విజ్ఞ‌ప్తి చేసారు. అందుచేత నేడు ఈ ఫ్లైఓవర్నఉ అందుబాటులోకి తెచ్చారు. నిజాంపేట్, ప్రగతి నగర్, కూక‌ట్‌ప‌ల్లి నుండి హైటెక్ సిటీకి ఇరువైపులా రోజుకు దాదాపు లక్షా అరవై వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/