కాళేశ్వరం పనులను పరిశీలించిన కేటిఆర్‌

ktr
ktr

మేడిగడ్డ: కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజి పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని టిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్‌ చెప్పారు. సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మలకపేట వద్ద టన్నెల్‌తో పాటు గ్రావిటీ కాల్వ పనులను అధికారులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పరిశీలనలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో పాటు కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/