విస్తృత స్థాయి సమావేశంలో కెటిఆర్‌

క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలే  టిఆర్‌ఎస్‌కు బలమని

TRS Party Cadre Meeting
TRS Party Cadre Meeting

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నిర్వహించిన నియోజకవర్గ టిఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశానికి హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలే టిఆర్‌ఎస్‌కు బలమని కెటిఆర్‌ అన్నారు. ఇప్పటి వరకు 50 లక్షల మంది టిఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రం బాగుపడుతుంటే కొందరికి నచ్చడం లేదని మండిపడ్డారు. తెలంగాణ పచ్చగా ఉండటం కాంగ్రెస్‌, బిజెపి నాయకులకు నచ్చడం లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో వేసిన ఎత్తుగడలు తెలంగాణలో వేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు,నవీన్‌, పార్టీ ఇతర నాయకులు పాల్గొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/