చేనేత మిత్ర ద్వారా 50 శాతం సబ్సిడీ

ktr,handloom-workers
ktr,handloom-workers

సిరిసిల్ల: 11 వేలకు పైగా మరమగ్గాల ఆధునీకరణకు 50 శాతం సబ్సిడీ ఇచ్చామని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బుధవారం కెటిఆర్ సిరిసిల్లలో పర్యటిస్తున్న సందర్భంగా మాట్లాడారు. చేనేత కార్మికుల అభివృద్ధిపై కెటిఆర్ సమీక్షలు జరిపారు. సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమ కార్మికులకు రుణాలు మాఫీ చేశామని గొప్పగా చెప్పారు. గత మూడేళ్లలో చేనేతకు రూ.900 కోట్లు విలువ చేసే బతుకమ్మ చీరలు ఆర్డర్ చేశామని పేర్కొన్నారు. నేత కార్మికులను ప్రారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు అద్భుతమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నామని కెటిఆర్ వివరించారు. సిరిసిల్ల పెద్దూరులో రూ.170 కోట్లతో అపారెల్ పార్క్ రూపుదిద్దుకుంటోందన్నారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌లో అధునాతన సౌకర్యాలు కల్పించామన్నారు. చేనేత మిత్ర లాంటి స్కీం దేశంలో ఎక్కడా లేదని, చేనేత మిత్ర ద్వారా 50 శాతం సబ్సిడీ అందిస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/