నటి మీరా చోప్రా ఘటనపై స్పందించిన కెటిఆర్‌

తెలంగాణ డీజీపీతో మాట్లాడానన్న కెటిఆర్‌

ktr
ktr

హైదరాబాద్‌: నటి మీరా చోప్రా పె ఓ హీరో అభిమానులు తనను దారుణంగా వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనపై మంత్రి కెటిఆర్‌కు మాజీ ఎంపి కల్వకుంట్ల కవితకు ట్వీట్‌ చేశారు. సామూహిక అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని, యాసిడ్ దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని, ఇంకా అనేక రకాలుగా దూషిస్తున్నారని కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే మీరా చోప్రా విజ్ఞప్తికి స్పందించిన కెటిఆర్ ట్విట్టర్ లో బదులిచ్చారు. ‘మేడమ్, ఈ విషయాన్ని పరిశీలించాలని నేను తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ను కోరాను. మీ ఫిర్యాదుపై చట్టాన్ని అనుసరించి కఠిన చర్యలు తీసుకోవాలని వారికి సూచించాను’ అంటూ ట్వీట్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/