నెలాఖరులోగా పూర్తిచేయాలి

సభ్యత్వ నమోదు భేష్

TRS Working President KTR
TRS Working President KTR

హైదరాబాద్‌: శుక్రవారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలతో టి ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ సమావేశమయ్యారు. నియోజవర్గాల ఇన్‌ఛార్జీలతో విడివిడిగా సమావేశమవడంతో పాటు గ్రూపులుగా ఏర్పాటు చేసి చర్చించారు. టిఆర్‌ఎస్ సభ్యత్వం లక్ష్యానికి చేరువైందనీ, కొన్ని నియోజకవర్గాల్లో లక్ష్యాన్ని ఛేదిస్తూ ముందుకు సాగుతుందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. అయి తే కొన్ని నియోజకవర్గాల్లో మరింతదృష్టి సారించి సభ్యత్వాన్ని నమోదు చేయాలని సూచించారు.అంతరంగికంగా జరిగిన ఈ సమావేశం సుమారు 5 గంటల పా టు సాగింది. సభ్యత్వ నమోదు ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లిన నాయకులను ఆయన అభినందించారు. నెల రోజుల పాటు నియోజకవర్గాల్లోనే బస చేస్తూ స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లిన నాయకులకు భవిష్యత్‌లో మంచి గుర్తింపు ఉంటుందని ఆయన ప్రకటించారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/