గచ్చిబౌలి వద్ద ఫ్లై ఓవర్ ని ప్రారంభించిన కెటిఆర్‌

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి

Image may contain: sky and outdoor


Gachibowli Fly Over
ktr
ktr
ktr & Sabitha Indra Reddy
ktr & Sabitha Indra Reddy

హైదరాబాద్‌:గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్‌ ఫ్లై ఓవర్ ని ప్రారంభించిన మంత్రులు శ్రీ కెటిఆర్‌ , ఈ వంతెన కారణంగా బయోడైవర్సిటి జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ కష్టాలు తగ్గనున్నాయి.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రాఫిక్ నియంత్రణకు నగర ప్రజలు విధిగా సహకరించాలని ఆయ కోరారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం కావడంతో ఖాజాగూడ నుంచి మైండ్‌స్సేస్ వైపు వెళ్లే వాహనదారులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆయన చెప్పారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా బయోడైవర్సిటీ జంక్షన్‌లో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టినట్టు ఆయన తెలిపారు. రూ.69.47కోట్ల వ్యయంతో ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. ఈ మూడు లేన్ల ఫ్లైఓవర్‌తో ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు పరిష్కారమవుతాయని కెటిఆర్ వెల్లడించారు. ఈ మార్గంలో ప్రస్తుతం గంటకు 14వేలకుపైగా వాహనాలు నడుస్తున్నాయని, 2035నాటికి వీటి సంఖ్య రెట్టింపవుతుందని అంచనావేసి ఈ ఫ్లైఓవర్‌ ను నిర్మించినట్టు ఆయన పేర్కొన్నారు. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే శ్రీ అరికపూడి గాంధీ మరియు మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/