కెటిఆర్‌కు డబ్ల్యూఈఎఫ్‌ ఆహ్వానం

ktr
ktr

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌కు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నిర్వహించే సదస్సుకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ సదస్సు అక్టోబర్‌ 3, 4 తేదీల్లో ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్యంతో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆన్‌ ఇండియా పేరుతో నిర్వహిస్తున్నట్లు డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. గత మూడు దశాబ్దాలుగా ఇండియా ఎకనామిక్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తున్న సమావేశాల విషయాలపై ఇందులో చర్చించనున్నట్టు తెలిపింది. మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్ ప్రధానాంశంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఫోరం తన ఆహ్వానంలో పేర్కొన్నది.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నది. కెటిఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ అనేక రంగాల్లో ముందంజ వేసిన విషయాన్ని ఫోరం ప్రత్యేకంగా ప్రస్తావించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/