కృష్ణా యాజమాన్య బోర్డు భేటీ!

సమావేశంలో తెలంగాణ, ఏపి, మహారాష్ట్ర, తమిళనాడు ఇంజినీర్లు

Jalasoudha at hyderabad
Jalasoudha at hyderabad

హైదరాబాద్‌: చెన్నైకి తాగు నీరు అందించే అంశంపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. హైదరాబాద్‌ జలసౌధలో బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన ఈ భేటీకి తెలంగాణ, ఏపి, మహారాష్ట్ర, తమిళనాడు ఇంజినీర్లు హాజరయ్యారు. చెన్నైకి కృష్ణా జలాల విడుదలపై అధికారులు సమావేశంలో చర్చిస్తున్నారు. తమకు ఇప్పటి వరకు 5.2 టీఎంసీ లు అందాయని తెలిపిన తమిళనాడు ఇంజినీర్లు శ్రీశైలం, కండలేరులో నీళ్లుండటంతో తమకు నీరివ్వాల్సిందిగా కోరుతున్నారు. అయితే చివరిగా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు. తమిళనాడుకు నీరు ఇస్తారా?లేదా? అన్నది సమావేశం ముగిసిన తర్వాత తెలియనుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/