సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు కొత్త కలెక్టర్లు

krishna bhaskar, venkatramireddy
krishna bhaskar, venkatramireddy


సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా పి.వెంకట్రామిరెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌ ఆఫీసులో వేదపండితుల ఆశీర్వచనం తీసుకుని ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన విషయం తెలిసిందే.
సిద్ధిపేట జిల్లాకు వెంకట్రామిరెడ్డిని, రాజన్న సిరిసిల్ల జిల్లాకు కృష్ణ భాస్కర్‌ను కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా కృష్ణభాస్కర్‌, సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి బాధ్యతలు చేపట్టారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/