కార్మికులను ఆదుకునేందుకు, కోవిడ్‌-19 సహయ

హైదరాబాద్‌లోనే సుమారు 16 వేల మంది వలస కార్మికులు అర్ధాకలితో ఉన్నారు

labour
migrant workers

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో వలస కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. వారి స్వస్థలాలకు వెళ్ధామంటే ప్రయాణ సౌకర్యాలు లేవు. దీంతో వారు ఇక్కడే ఉంటూ అర్ధాకలితో కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులలో వారిని ఆదుకోవడానికి రాష్ట్రంలోని స్వంచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలు ఒక్కటిగా ఏర్పడి కోవిడ్‌-19 సహయ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమంతొ దాతలు, ప్రభుత్వ సాయంతో వలస కార్మికులకు సహయం చేయవచ్చు. కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 25 వేల మంది వలస కార్మికులు ఉన్నారని, అందులో దాదాపు 16 వేల మంది తక్షణ సాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని స్వచ్చంద సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలకు తెలపడం, వారుకూడా సానుకూలంగా స్పందించడంతో ముందడుగు వేస్తున్నారు. దాతలు ఎవరైనా వలస కార్మికులకు ఈ కార్యక్రమం ద్వారా సహయం చేయాలని, స్వచ్చంద సంస్థల అధికారులు తెలుపుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/