కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండి

గ్రామాన్ని ముంచెత్తిన నీరు..మునిగిన పొంట పొలాలు

kondapochamma-sagar

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ జలాశయం కాల్వకు గండి పడింది. జలాశయం నుంచి బయటపడిన నీరు గ్రామాన్ని ముంచెత్తింది. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు కాలువకు నీటి విడుదలను ఆపివేశారు. కాగా, ఇటీవలే ఈ జలాశయం నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీటిని విడుదల చేశారు. ఉదయం పూట ఈ ఘటన జరిగింది కాబట్టి సరిపోయిందని, అదే రాత్రివేళ అయితే పెను నష్టం జరిగి ఉండేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/