కేంద్ర మంత్రివర్గంలోకి కిషన్‌ రెడ్డి?

Kishan Reddy
Kishan Reddy

హైదరాబాద్‌: ఈరోజు మోడి భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో మంత్రివర్గం కూడా ప్రమాణం చేయనుంది. అయితే ఈ సారి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే విషయంపై చర్చ నడుస్తుంది. కాగా ఈ సారి తెలంగాణ నుండి ఒకరికి చోటు ఖాయంగా కనిపిస్తుంది. సికింద్రాబాద్‌ నుంచి ఘన విజయం సాధించిన కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో బెర్త్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి దాదాపు 50వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించిన కిషన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నరేంద్ర మోడి, అమిత్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు కిషన్‌రెడ్డికి సమాచారం అందిందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/