7న హైదరాబాద్‌కు రానున్న కిషన్‌రెడ్డి

Kishan Reddy
Kishan Reddy

హైదరాబాద్‌: కేంద్రహోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జి. కిషన్‌రెడ్డి తొలిసారిగా ఈ నెల 7న నగరానికి రానున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. అలాగే బేగంపేట నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 7న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి కిషన్‌రెడ్డి చేరుకోనున్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/