హైదరాబాద్ కు కేరళ నర్సులు

కరోనా బాధితుల చికిత్స కోసం

Kerala nurses to Hyderabad
Kerala nurses to Hyderabad

Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువైన నేపథ్యంలో వారి చికిత్స కోసం నర్సుల కొరత ఏర్పడింది. నిత్యం వందల సంఖ్యలో రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో    కేరళ నుంచి హుటాహుటీన 50 మంది నర్సులను చార్టర్డ్ విమానాల్లో తీసుకువచ్చారు.

రెండు ప్రైవేటు ఆసుపత్రులు తమ ఆసుపత్రులలో కరోనా రోగుల చికిత్స కోసం వీరిని రప్పించారు.   

 తాత్కాలిక ప్రాతిపదికన అయినా నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు, ఒక్కో నర్సుకు రూ.50 వేల వరకు జీతం ఆఫర్ చేస్తున్నాయని చెబుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/