టిఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురవేసిన కెసిఆర్‌

నేడు టిఆర్‌ఎస్‌ ఆవిర్బావ దినోత్సవం

KCR with TRS party flag hoisted
KCR with TRS party flag hoisted
cm kcr hodit party flag at telangana bhavan
cm kcr hosting party flag at telangana bhavan

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా స్థాపించిన టిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్బవించి నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా పార్టీ ఆవిర్బావ వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు నేడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు, తెలంగాణలో పార్టీ అన్ని రంగాల్లో ఘనవిజయం సాధించి, దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి అతి కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. అందరు కూడా సామాజిక దూరానిల్న పాటించారు. ముందుగా తెలంగాణ తల్లికి పూలమాల వేసి నమస్కరించిన కెసిఆర్‌ అనంతరం ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తరువాత జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/