అత్తివరదరాజస్వామి వారిని దర్శించుకున్న సిఎం కెసిఆర్‌

cm kcr
cm kcr

కాంచీపురం: తెలంగాణ సిఎం కెసిఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామి వారినిదర్శించుకున్నారు. కాగా నగరిలో ఆయనకు ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ ఆర్కే రోజా స్వాగతం పలికారు. అనంతరం కాంచీపురం చేరుకోగానే అక్కడ ఆలయ అధికారులు, వేదపండితులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం అత్తివరదరాజస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె, మాజీ ఎంపీ కవితతో పాటు ఆర్కే రోజా, తదితరులు ఉన్నారు. కాంచీపురం నుంచి కేసీఆర్‌ తిరుమల వెళ్లనున్నారు. అక్కడ శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/