అధికార వికేంద్రీకరణ ద్వారా విధులు, నిధులు

kcr, ts cm
kcr, ts cm

Hyderabad: పల్లెల రూపు మార్చేందుకు కొత్త చట్టాలను తెచ్చామన్నారు సీఎం కెసిఆర్. పంచాయతీ రాజ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం పంచాయతీ రాజ్ శాఖను బలోపేతం చేయాలనీ, పంచాయతీ ప్రజాప్రతినిధుల నుండి జిల్లా పరిషత్ వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనేదానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని, అధికార వికేంద్రీకరణ ద్వారా విధులు, నిధులు, అధికారాలు ఇస్తామన్నారు. పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు కలెక్టర్ అధ్యక్షతన గ్రీన్ కమిటీని ఏర్పాటు చేస్తామని, పట్టుదలతో పనిచేస్తేనే గ్రామాల్లో మార్పు వస్తుందన్నారు.