చూస్తూ ఉండలేం..తగిన చర్యలు తీసుకుంటున్నాం

తెలంగాణలో మరొకరికి కరోనా వైరస్ సిఎం కెసిఆర్‌

cm kcr
cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ తెలంగాణ శాసనసభలో కరోనా అంశంపై జరిగిన చర్చలో మాట్లాడారు. శంలో ఇప్పటివరకూ కరోనా వైరస్ 65 మందికి సోకిందని తెలిపారు. తెలంగాణలో గాంధీ ఆస్పత్రి నుంచీ ఓ యువకుడికి వైరస్ తగ్గిపోవడంతో… డిశ్చార్జి చేశామన్న కెసిఆర్‌ ఇప్పటివరకూ ఇండియాలో ఇద్దరు మాత్రమే కరోనా వైరస్ వల్ల చనిపోయినట్లు తెలిపారు. చరిత్రలో ఇలాంటి వైరస్‌లు చాలాసార్లు దాడి చేశాయన్న కెసిఆర్‌ వైరస్‌లు దేశాల మధ్య వ్యాపిస్తూ ఉంటాయని అన్నారు. ప్రస్తుతానికి తెలంగాణ సేఫ్‌గా ఉందన్న కెసిఆర్‌… ఇటలీ నుంచీ వచ్చిన ఓ వ్యక్తికి మాత్రం కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు. ఆ వ్యక్తికి గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ట్రీట్‌మెంట్ అందుతోందని వివరించారు. మరో ఇద్దరిపై కూడా అనుమానం ఉందని తెలిపారు. వారి శాంపిల్స్ పుణె ల్యాబ్‌కి పంపినట్లు వివరించారు.

బయటి నుంచీ వచ్చే వ్యక్తుల వల్లే తెలంగాణలో కరోనా వైరస్ వస్తోందన్న కేసీఆర్… చూస్తూ ఉండలేమన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయన్న కెసిఆర్‌ అంతటా షట్ డౌన్ అవుతోందన్నారు. ఫంక్షన్లు కూడా జరపట్లేదని వివరించారు. కరోనాపై తెలంగాణలో హైలెవెల్ మీటింగ్ జరుగుతోందన్నకెసిఆర్‌ తెలంగాణలో ఏం చెయ్యాలనేది ఆ మీటింగ్ చర్చిస్తోందన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/