16 స్థానాలు మనవే

ts cm kcr
ts cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు 17 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా బుధవారం తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. జిల్లాలోని మంత్రులు, పార్టీ అభ్యర్థులు, శాసనసభ్యులు, మండలి సభ్యులతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్‌ సత్తా చాటుతుందన్నారు. లోక్‌సభ రాష్ట్రంలో 16 స్థానాలు టిఆర్‌ఎస్‌కే దక్కుతాయని కెసిఆర్‌ అన్నారు. రాష్ట్రవాప్తంగా పార్టీ శ్రేణులు ఎన్నికల విజయంపై సంబురాలు చేసుకొవాలని ఆయన సూచించారు. శాసనసభ ఎన్నికల మాదిరే లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ ఏకపక్షంగా ఉంటాయన్నారు. విపక్షాలు మళ్లీ చిత్తుగా ఓడిపోతాయని తెలిపారు. తెరాస పార్టీ శ్రేణులు ఓట్ల లెక్కింపు వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మంత్రులు ఓట్ల లెక్కింపు ఏజెంట్లకు అన్ని విధాలా జాగ్రత్తలు చెప్పాలన్నారు. ఎక్కడయినా సమస్య తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. తెలంగాణభవన్‌ వద్ద ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని, ఏమైనా సందేహాలుంటే సంప్రదించాలని అన్నారు.


మరిన్ని క్రీడ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/