కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హరీశ్‌ను పిలవాలి

chinna reddy
chinna reddy, congress leader

హైదరాబాద్‌: ప్రాజెక్టులకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదని, ప్రాజెక్టుల్లో అవినీతికి తాము వ్యతిరేకమని కాంగ్రెస్‌నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ..ఓ వ్యక్తిని , పార్టీని సంతృప్తి పరచడానికి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు వేరుగా నిర్వహించారని చిన్నారెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి హరీశ్‌రావును కూడా పిలవాలన్నారు. ఇప్పుడు తామే కష్టపడినట్లు తండ్రి, కొడుకులు గొప్పగా చెప్పుకోవడం సరికాదని చిన్నారెడ్డి అన్నారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos