యాదాద్రి ఆలయంపై కెసిఆర్, తెరాస గుర్తు

Img
Img

Yadadri: యాదాద్రి ఆలయంపై తెలంగాణ సీఎం కెసిఆర్, తెరాస పార్టీ కారు గుర్తులను చెక్కడంపై వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వివాదంపై ఆలయ అభివృద్ధి పనులలో శిల్పాలు, కళాకారుల పనులను పర్యవేక్షిస్తున్న సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, యాదాద్రి ప్రత్యేక అధికారి కిషన్ రావు ఆలయపనులలో శిల్పాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడిన కిషన్ రావు శిలలపై రాజకీయ ప్రతిమలు చెక్కారా? లేదా అన్నది పరిశీలించామని, ఏ ఆలయంపైనైనా ఆనాటి పరిస్థితులను ప్రతిబింబించేలా శిల్పాలు చెక్కడం సహజమేనని, ఇది ఏ వ్యక్తి కోసమో చెక్కినవి కాదన్నారు. అహోబిలం శిలలపై నెహ్రు, గాంధీ బొమ్మలు ఉన్నాయని, ఇక్కడ కెసిఆర్ కోసం చెక్కించామనడం సరికాదని, అభ్యంతరాలుంటే సరిచేస్తామన్నారు. ఇక ఆనంద్ సాయి మాట్లాడుతూ కెసిఆర్, కారు ప్రతిమలు కేవలం బాహ్య ప్రకారంలో మాత్రమే ఉన్నాయని, ఇవి చెక్కాలని శిల్పులకు ఎవరూ చెప్పలేదని, సీఎంను దేవుడిగా భావించి వారే ప్రతిమలను చెక్కారన్నారు