స్నేహితుడికి సిఎం కెసిఆర్‌ ఆత్మీయ ఆలింగనం

కలిసేందుకు రాగా, యోగక్షేమాలను అడిగినకెసిఆర్‌

KCR-SAMPATH KUMAR
KCR-SAMPATH KUMAR

కొత్తపల్లి: కరీంనగర్ శివారు ప్రాంతంలో ఉన్న తీగల గుట్టపల్లె నివాసంలో సిఎం కెసిఆర్‌ను సంపత్ కుమార్ కలిసేందుకు రాగా, వెంటనే లేచి వెళ్లి, ఆలింగనం చేసుకుని, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చాలా రోజుల తరువాత స్నేహితుడిని చూసిన ఆనందం కేసీఆర్ మోములో కనిపించింది. ఈనెల 15న తన సోదరుడి కుమారుడి వివాహం ఉందని, ఆ కార్యక్రమానికి వచ్చి వధూ వరులను ఆశీర్వదించాలని సీఎంకు వెడ్డింగ్ ఇన్విటేషన్ ను అందించిన సంపత్ కుమార్, తమకున్న స్నేహ బంధాన్ని మీడియాకు తెలిపారు. హైదరాబాద్, కాచిగూడలోని నింబోలి అడ్డాలో, తాను, కేసీఆర్ ఒకే గదిలో ఉండే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తామిద్దరమూ ఉస్మానియా యూనివర్శిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ను కలిసి చేశామని అన్నారు. అప్పటి నుంచి కేసీఆర్ మారలేదని, ఇప్పటికీ తమ స్నేహం కొనసాగుతూనే ఉందని అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/