అధికారులతో సిఎం అత్యవసర సమావేశం

కోర్టుకు అందించాల్సి నివేదికపై సిఎం దిశానిర్దేశం

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. అధికారులతో యూనియన్ నేతలు జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాల్సిందేనని కార్మికులు పట్టుబడుతుండగా… ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. దీంతో, సిఎం కెసిఆర్‌ ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, అడ్వొకేట్ జనరల్, కీలక అధికారులు హాజరయ్యారు. కోర్టుకు అందించాల్సిన నివేదికపై వీరికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ వినిపించనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/