ప్రతి భవనం చారిత్రకమంటూ కొందరు వితండవాదం

KCR
KCR, Telangana CM

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా సియం కేసిఆర్‌ ప్రసంగిస్తూ.. ప్రతి భవనాన్ని చారిత్రక భవనమే అంటూ కొందరు వితండవాదం చేస్తున్నారని, ప్రతిభవనం చారిత్రక భవనమే ఐతే, అభివృద్దికి చోటుండదని అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక వారసత్వ భవనమని, ఇప్పుడున్న స్థలంలోనే కొత్త ఆసుపత్రిని నిర్మించాలని కొందరు కోరుతున్నారన్నారు. కొన్ని నిబంధనల వల్ల పురాతన భవనాలను కూల్చివేయడం సాధ్యం కాదని కేసిఆర్‌ అన్నారు. అలాగే రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్యను 142కు పెంచామని, ఐదు వేల పరిపాలన విభాగాలు ఏర్పాటు చేయడమే కాక సాహసోపేతమైన అనేక నిర్ణయాలు తీసుకున్నామని సియం అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులు తీసువచ్చామన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/