ఆర్టీసి విషయంలో నియంతలా ప్రవర్తిస్తున్న కెసిఆర్‌

uttam kumar reddy
uttam kumar reddy

హైదరాబాద్‌: హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ఒడిపోయిన తర్వాత ఒటమికి గల కారణాలను సమీక్షుంచుకొవడానికి మంగళవారం గాందీభవన్‌లో టిపిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లడుతూ ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం మంచిది కాదన్నారు. తన మొండి వైఖరితో సీఎం కెసిఆర్‌ ఆర్టీసి కార్మికులను వేధిస్తున్నారని ఇప్పటివరకు జరిగిన ఆర్టీసి కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని వ్యాఖ్యానించారు. ఆర్టీసి కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తాము అండగా ఉంటామని, కాంగ్రెస్‌ పార్టీ ఆర్టీసి కార్మికుల పక్షాన నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ కెసిఆర్‌ లాంటి మొండి ముఖ్యమంత్రిని నా జీవితంలో చూడలేదని అన్నారు. ఉద్యమంలో ఉపయోగపడిన ఆర్టీసి కార్మికులు ఇపుడు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా కెసిఆర్‌కు తెలివి రాలేదన్నారు. ఎంత తొందరగా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే..అంత మంచిదన్నారు.
తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/