సచివాలయ గబ్బిలాల కొంపగా ఉంది

karne-prabhakar
karne-prabhakar

హైదరాబాద్‌: కర్నె ప్రభాకర్ ఈరోజు మీడియాతో మాట్లాడారుఇప్పుడున్న సచివాలయం గబ్బిలాల కొంపగా మారిందని ఆయన విమర్శలు గుప్పించారు. సచివాలయానికి ఫైర్ సెఫ్టీ ప్రమాణాలు లేవన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో విగ్రహాలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని, అలాంటిది ప్రజలకు ఉపయోగపడే అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలను బిజెని నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని విరుచుకపడ్డారు. కేరళ, త్రిపుర, గోవాల్లో కొత్త అసెంబ్లీ భవనాలు కట్టారని, గుజరాత్ అసెంబ్లీ అధునీకీకరణకే రూ.131 కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. ప్రతిదానిని విమర్శించడమే విపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. భవిష్యత్ తరాల అవసరాలకు సరిపోయేలా నూతన భవన నిర్మాణాలుంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న సభ్యులకు సరిపోయేలా అసెంబ్లీలో వసతులు లేవని, స్టాండింగ్ కమిటీలకు గదులు కేటాయించలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రపంచమే అబ్బురపడేలా నూతన అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలు ఉన్నాయని, అసెంబ్లీ సమావేశాలప్పుడు మీడియా వాహనాలకు పార్కింగ్ సరిపోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని కర్నె డిమాండ్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/