కరీంనగర్‌లో కొనసాగుతున్న మున్సిపల్‌ పోలింగ్‌

Polling
Polling

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో ఈరోజు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. వాటిలో రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు. మిగిలిన 58 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మొత్తం 369 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 82 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,72,195 లక్షల మంది ప్రజలు ఓటు వేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/