మల్కాజ్‌గిరి మాజీ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కన్నుమూత

kanaka reddy
kanaka reddy, former malkajgiri trs mla

హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 2014-18 మధ్య మల్కాజ్‌గిరి నుంచి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కనకారెడ్డి పనిచేశారు.
కనకారెడ్డి మృతి పట్ల తెలంగాణ సియం కేసిఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/