కాళోజీ అవార్డును ప్రకటించిన ప్రభుత్వం

Kaloji Narayana Rao
Kaloji Narayana Rao

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 2019 సంవత్సరానికి గానూ కాళోజి నారాయణరావు అవార్డును ప్రకటించింది. కోట్ల వెంకటేశ్వర్ రెడ్డికి కాళోజీ నారాయణరావు పురస్కారం వరంచినట్టు భాషా సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 9న కాళోజీ 105వ జయంతి సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డికి ఈ అవార్డుతో రూ.101116 నగదును తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు నలుగురికి ఈ అవార్డులను ఇచ్చింది. 2018లో ప్రముఖ నవలా రచయిత డాక్టర్ అంపశయ్య నవీన్, 2017లో ప్రముఖ కవి సీతారం, 2016లో ప్రముఖ రచయిత, గాయకుడు గోరెటి వెంకన్న, 2015లో సుప్రసిద్ద రచయిత అమ్మంగి వేణుగోపాల్ లు కాళోజీ పురస్కారాలు అందుకున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/