ఈ 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం

ముఖ్యఅతిథిగా ఏపి సియం జగన్‌

kcr, jagan
kcr, jagan

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని తెలంగాణ సియం కేసిఆర్‌ నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపి సియం జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే సియం కేసిఆర్‌ స్వయంగా వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నట్లు సమాచారం. దాదాపు 150 టిఎంసీల గోదావరి జలాలను నిల్వఉంచేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/