గాంధీ ఆసుపత్రి వైద్యుల‌పై దాడి

జూనియర్ డాక్టర్లు, సిబ్బంది ఆందోళన

Junior doctors dharna

Hyderabad: గ‌త రాత్రి క‌రోనా పేషేంట్ మృతి చెంద‌డంతో కొంద‌రు గాంధీ ఆసుపత్రి వైద్యుల‌పై దాడి చేశారు.. హాస్ప‌ట‌ల్లోని ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం చేశారు.

క‌రోనా పేషేంట్స్ ను కాపాడేందుకు ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి సేవ‌లందిస్తున్న త‌మ‌పైనే దాడి చేయ‌డాన్ని ‘గాంధీ’ వైద్యులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు..

దీంతో నేటి ఉద‌యం విధుల బ‌హిష్క‌రించి న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించారు వైద్య సిబ్బంది. సీఎం రావాల్సిందే..మేము రాము..మీరే రండి..అంటూ మంత్రులకు జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు.

జరుగుతున్న దాడులను అరికట్టాలి…అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సమస్యలపై చర్చించేందుకు జుడాల సంఘం నాయకులను సచివాలయానికి రావాలని మంత్రి ఈటెల సూచించారు.

కానీ ఈ పిలుపును జూడాలు వ్యతిరేకించారు. సమస్య ఉన్న చోటికే మంత్రులు రావాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.

కాగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి.. జూనియర్‌ వైద్యుడిపై దాడికి దిగాడు. ఐసీయూలో బీభత్సం సృష్టించాడు.

ఈ దాడిలో జూనియర్‌ డాక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో గాంధీ ఆస్పత్రి సిబ్బంది ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్లు, నర్సులు డిమాండ్‌ చేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/