వేతనాల కోతపై జీవో జారీ

kcr
kcr

హైదరాబాద్‌: కరోనా ప్రభావంతో రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థను నిలకడగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో బాగంగా రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రజానాయకుల వేతనాల్లో కోత విదించాలని నిర్ణయించింది. కాగా ఈ మొత్తాన్ని ఆర్ధిక పరిస్థితి మెరుగుపడ్డాక తిరిగి చెల్లించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఎవరి వేతనాల్లో ఎంత శాతం కోత విదించాలనే విషయంపై ఒక జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.

  • ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరెషన్‌ చైర్‌పర్సన్‌లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతనాల్లో- 75శాతం
  • ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, తదితర అఖిల భారత సర్వీస్‌ అధికారుల వేతనాల్లో – 60శాతం
  • మిగతా అన్ని క్యాటగిరి ఉద్యోగుల వేతనాల్లో – 50శాతం
  • అన్ని రకాల రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌లలో – 50 శాతం
  • నాల్గవ తరగతి, ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో -10శాతం
  • నాల్గవ తరగతి రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌లలో – 10శాతం

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/