హైదరాబాద్‌లో జనసేన విద్యార్థి గర్జన

ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహణ

JanaSena Party
JanaSena Party

హైదరాబాద్‌: జనసేన పార్టీ నేతృత్వంలో రేపు హైదరాబాద్‌లో విద్యార్థి గర్జన నిర్వహించనుంది. ఉస్మానియా యూనివర్సిటీలో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విద్యార్థి గర్జనను నిర్వహించనున్నట్లు పార్టీ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయడం. తెలంగాణలో మధ్యపాన నిషేధం, మహిళలపై జరిగే దాడులు, వాటిని అరికట్టే చట్టాలు అమలు అయ్యేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు వంటి పలు ప్రధాన డిమాండ్లతో విద్యార్థి గర్జన నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/